వార్తలకు తిరిగి వెళ్లండి

వీర్నపల్లి మండలం వెంకట్రాయిని చెరువులో చేపల వేటకు వెళ్లిన భూక్య ప్రశాంత్(25) ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. వల వేస్తుండగా మూర్చకు గురై ఆయన నీటిలో పడిపోయారని స్థానికులు తెలిపారు.
గత నెలలోనే వివాహం జరిగిన ప్రశాంత్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక, పోలీసు సిబ్బంది ఎనిమిది గంటలుగా ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి.
Comments
Loading comments...

