వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
Photo Gallery
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడం, దానికి తోడు వేసవి సెలవులు ముగుస్తుండడంతో లక్ష్మీనరసింహుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.
క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోవడంతో ప్రస్తుతం స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...


