వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు వీరగోని బక్కయ్య (50) తాటి చెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. వృత్తిలో భాగంగా చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.
చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. బక్కయ్య మృతితో కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

