వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ ఏడాది వేసవి ఎండలు, ఉక్కపోత కారణంగా విజయవాడలో విద్యుత్ వినియోగం గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఎన్టీఆర్ జిల్లా వాసులు గత ఏడాది కంటే ఏకంగా 30 శాతం అదనంగా విద్యుత్తును వాడేశారు.
ముఖ్యంగా మే 26న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1.77 కోట్ల యూనిట్ల వినియోగం నమోదైంది. రాత్రి వేళల్లో ప్రజలంతా ఒకేసారి ఏసీలు ఆన్ చేస్తుండటంతో రాత్రి 10 గంటల సమయంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏర్పడుతోందని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

