Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల వేతనాల పెంపు

Follow Udayam on Google
Rohit Singh May 21, 2026 1:49 PM హైదరాబాద్General
కార్మికుల వేతనాల పెంపు - Udayam
తెలంగాణలోని 1.11 కోట్ల మంది కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు కార్మికులను నాలుగు కేటగిరీలుగా, ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించి వేతనాలను సవరించినట్లు ఆయన మీడియాకు వివరించారు. దీని ప్రకారం జోన్-1లో అన్‌స్కిల్డ్ వేతనం రూ.16 వేలకు, హైస్కిల్డ్ వేతనం రూ.20 వేలకు పెరిగింది. ఈ కొత్త వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Comments

G
Loading comments...