వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లాలో పొట్టదశలో ఉన్న వరి పంటలకు నీరందించేందుకు మంగళవారం నుంచి సరస్వతి కాలువ ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. శ్రీరామసాగర్ నుంచి వచ్చే ఈ నీరు ఏడు మండలాల్లోని సుమారు 33 వేల ఎకరాల ఆయకట్టుకు ఉపయోగపడనుంది.
ఎల్‌నినో ప్రభావంతో చెరువుల్లో నీటిమట్టం తగ్గింది. వారం పాటు విడుదలయ్యే నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

