వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో 30-35% ఓట్లను నకిలీవని పేర్కొంటూ తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
ఓటర్ల జాబితా సవరణ పేరుతో కేంద్రం దొంగదారిలో ఓట్ల వేట సాగిస్తోందని మంత్రి మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలో ప్రయోగించేందుకు సిద్ధమయ్యారని, దీనిపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

