వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం ఘోర ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్-2, ఎస్‌టీసీ-3 హీట్ ఎఫ్‌జీ విభాగంలో ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తున్న సమయంలో భారీ మొత్తంలో ఉక్కుద్రవం లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ దారుణ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Comments
Loading comments...

