వార్తలకు తిరిగి వెళ్లండి

సింగుపురంలో అతిసారం మరోసారి విజృంభించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత నాలుగు రోజులుగా వాంతులు, విరేచనాలతో 30 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, ప్రస్తుతం 17 మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
కలుషిత నీరు, ఆహార కల్తీ దీనికి కారణమని అనుమానిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. అయితే కేసులు నమోదు కాలేదని డీఎంహెచ్‌వో చెప్పడం గమనార్హం.
Comments
Loading comments...

