వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాద్రి అప్పన్న దర్శనానికి వచ్చే భక్తులకు రాత్రివేళల్లో ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆలయంలో రాత్రి దర్శనాలు ముగిసిన తర్వాత కొండ పైనుంచి కిందకు వచ్చే భక్తులకు, రాత్రి 9:45 గంటల దాటిన తర్వాత సింహాచలం బస్‌స్టాండు నుండి నగరంలోకి వెళ్లేందుకు ఆర్టీసీ సర్వీసులు కానరావడం లేదు.
ఫలితంగా సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు చీకట్లో గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...

