వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమానయాన రంగానికి రూ.36 వేల కోట్ల నుంచి రూ.38 వేల కోట్ల వరకు నష్టాలు రావొచ్చని ఇక్రా అంచనా వేసింది. గతేడాది నష్టాలు రూ.28–30 వేల కోట్లుగా అంచనా వేసింది.
ప్రయాణికుల వృద్ధి మందగించడం, ఇంధన ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం నష్టాలకు ప్రధాన కారణాలని తెలిపింది. పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా టికెట్ ధరలు పెంచలేకపోతున్నట్లు వెల్లడించింది.
Comments
Loading comments...

