Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లిలో భూ అక్రమాలపై విజిలెన్స్ విచారణ

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 12:04 PM పల్నాడు General
దాచేపల్లిలో భూ అక్రమాలపై విజిలెన్స్ విచారణ - Udayam
దాచేపల్లి మండలంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ప్రత్యేక విజిలెన్స్ కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ బృందం పొందుగుల, గామాలపాడు, రామాపురం, తంగెడ, పెదగార్లపాడు గ్రామాల్లో పర్యటించి భూ లావాదేవీలపై ఆరా తీస్తోంది.

Comments

G
Loading comments...