Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ పెట్టుబడుల భారీ ఉపసంహరణ

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 3:01 PM జాతీయంవాణిజ్యం
విదేశీ పెట్టుబడుల భారీ ఉపసంహరణ - Udayam
అక్టోబరులో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు దేశీయ ఈక్విటీల నుంచి రూ.34,843 కోట్లు ఉపసంహరించుకున్నారు. వరుసగా రెండో నెలా భారీగా నిధులు తరలించారు. చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఆందోళనలు, అమెరికా బాండ్ల ఆకర్షణ ఇందుకు కారణాలని నిపుణులు తెలిపారు. ఈ ఏడాది మొత్తం ఉపసంహరణలు రూ.2.95 లక్షల కోట్లు దాటాయి. అయితే అక్టోబరు చివరి ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.6,300 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

Comments

G
Loading comments...