వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దముడియం మండలంలో స్నేహితుల నమ్మక ద్రోహానికి మనస్తాపం చెంది రవిశంకర్‌రెడ్డి అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశతో కుటుంబానికి చెందిన 60 తులాల బంగారాన్ని నమ్మి స్నేహితులకు అప్పగించగా, వారు దాన్ని కరిగించి అమ్ముకుని దారుణంగా మోసం చేశారు.
ఈ మోసం బయటపడటంతో తీవ్ర తీవ్ర మనస్తాపానికి గురైన సదరు రైతు విషం తాగి, ఆపై ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Loading comments...

