వార్తలకు తిరిగి వెళ్లండి
జమ్మూకశ్మీర్ బురదలో కూరుకుపోయిన వాహనాలు
జమ్మూ కాశ్మీర్‌లోని కిష్టవార్ క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద ఆదివారం రాత్రి భారీ క్లౌడ్‌బరస్ట్ సంభవించింది. కొండచరియలు విరిగిపడటంతో ప్రాజెక్టు ప్రదేశంలో బురద, శిథిలాలు పేరుకుపోయి అనేక వాహనాలు, ట్రక్కులు కూరుకుపోయాయి.
ఈ విపత్తు కారణంగా జమ్మూ-కిష్టవార్ జాతీయ రహదారి పూర్తిగా మూసుకుపోయింది. అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. అటు దోడా జిల్లా ప్రేమ్ నగర్‌లోనూ కొండచరియలు విరిగిపడటంతో రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది.
Comments
Loading comments...