Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ నమ్మశక్యంకాని గోల్

Follow Udayam on Google
Kiran Jun 15, 2026 10:48 AM జాతీయంక్రీడలు
ఆ నమ్మశక్యంకాని గోల్ - Udayam
ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్-ఈ మ్యాచ్‌లో ఈక్వెడార్‌పై ఐవరీ కోస్ట్ 1-0 తేడాతో సంచలన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరి నిమిషం వరకు ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ డ్రా అవుతుందని అంతా భావించారు. అయితే 90వ నిమిషంలో ఐవరీ కోస్ట్ మిడ్‌ఫీల్డర్ అమడ్ డియాల్లో అద్భుత గోల్ కొట్టి జట్టుకు థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. వరుసగా 19 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని ఈక్వెడార్‌కు షాకిస్తూ ఐవరీ కోస్ట్ ఈ టోర్నీలో ఖాతా తెరిచింది.

Comments

G
Loading comments...