వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా ఆర్థిక జీవనాడి అయిన చమురు క్షేత్రాలు, ఇంధన కేంద్రాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులను తీవ్రతరం చేసింది. స్టావ్‌రోపోల్, ట్వెర్ ప్రాంతాల్లోని ఆరు చమురు డిపోలను తమ దళాలు ధ్వంసం చేశాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు.
యుద్ధాన్ని ముగించడానికి మాస్కో నిరాకరిస్తున్నందునే ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. యుద్ధం ముగిసేవరకూ రష్యాలో ప్రతిరోజూ ఇలాంటి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంటామని జెలెన్‌స్కీ హెచ్చరించారు.
Comments
Loading comments...

