Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరి బిట్‌–3లో టీడీపీ, జనసేన పోటీ

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 12:27 PM నెల్లూరుGeneral
ఉదయగిరి బిట్‌–3లో టీడీపీ, జనసేన పోటీ - Udayam
ఈనెల 5న జరగనున్న ఎంపీటీసీ ఎన్నికల్లో ఉదయగిరి బిట్‌–3 సెగ్మెంట్‌ ఆసక్తికరంగా మారింది. కూటమి పొత్తుకు భిన్నంగా టీడీపీ నుంచి బొజ్జ శ్రీనివాసులు, జనసేన నుంచి గాదె నరేంద్ర పోటీలో నిలిచారు. వైసీపీ అభ్యర్థిగా మోడీ రామాంజనేయులు యాదవ్ బరిలో ఉన్నారు. ఒకే కూటమికి చెందిన రెండు పార్టీల అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఓటర్ల తీర్పు, క్రాస్‌ ఓటింగ్‌పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...