Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'వెన్నుపోటుకు రెండేళ్లు': వైసీపీ ర్యాలీలు

Follow Udayam on Google
Rohit Singh May 27, 2026 12:53 PM అమరావతిGeneral
'వెన్నుపోటుకు రెండేళ్లు': వైసీపీ ర్యాలీలు - Udayam
చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా సూపర్-సిక్స్ హామీలను అమలు చేయలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారని, బడ్జెట్‌లో మహిళలు, నిరుద్యోగులకు నిధులు కేటాయించకుండా మోసం చేశారని బుధవారం నాటి పార్టీ సమావేశంలో మండిపడ్డారు. ఇచ్చిన హామీలపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ జూన్ 4 నుండి 12 వరకు 'వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ర్యాలీలు నిర్వహిస్తుందని ఆయన ప్రకటించారు.

Comments

G
Loading comments...