Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

గోదావరి కాలుష్య నివారణకు టాస్క్‌ఫోర్స్

Rohit Singh May 27, 2026 10:05 AM అమరావతి 16 viewsabout 8 hours ago
గోదావరి కాలుష్య నివారణకు టాస్క్‌ఫోర్స్ - Udayam Digital
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదీ కాలుష్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. రాజమహేంద్రవరంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జరిపిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. నదిలోకి పారిశ్రామిక రసాయనాలు, మురుగునీరు చేరకుండా ఈ కమిటీ తక్షణ చర్యలు తీసుకోనుంది. పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలోని ఈ టాస్క్‌ఫోర్స్ ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై క్షేత్రస్థాయి పరిశీలనలు జరుపుతుంది.

Comments

G
Loading comments...