వార్తలకు తిరిగి వెళ్లండి
నిలిచివున్న బస్సును ఢీకొట్టిన ట్రక్.. ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏతా జిల్లాలోని ఏతా-అలీగంజ్ రోడ్డుపై గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న రోడ్డు రవాణా సంస్థ (UPSRTC) బస్సును వెనుక నుంచి అతివేగంతో వచ్చిన ఒక క్యాంటర్ ట్రక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో, బాగ్ వాలా ప్రాంతంలోని కీలర్‌మౌ గ్రామం వద్ద డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి ఉంచాడు.
Comments
Loading comments...