Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద ముంపులోనే గిరిజన గురుకులం

Follow Udayam on Google
Suresh Jun 11, 2026 12:34 PM నల్గొండGeneral
వరద ముంపులోనే గిరిజన గురుకులం - Udayam
దేవరకొండ మండలం కొమ్మెపల్లి గిరిజన గురుకుల పాఠశాల చిన్నపాటి వర్షాలకే మళ్లీ జలదిగ్బంధంలో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉంది. గతేడాది భారీ వరదలకు పాఠశాల మునిగిపోవడంతో 540 మంది విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోగా, అధికారులు తాళ్ల సాయంతో వారిని రక్షించారు. పాఠశాల వాగు పక్కనే, లోతట్టు ప్రాంతంలో ఉన్నప్పటికీ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించకపోవడమే ఈ ముంపునకు ప్రధాన కారణం. నాడు ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, పాఠశాల భూమి ఆక్రమణకు గురికావడంతో విద్యార్థుల భద్రత మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది.

Comments

G
Loading comments...