వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యాచారం గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తున్న తల్లి భారతమ్మ(45), పదో తరగతి పూర్తి చేసిన ఆమె కుమారుడు అఖిల్(16) వెనుక టిప్పర్ డ్రైవర్ గమనించకుండా వాహనాన్ని వెనక్కి తోలాడు.
ఈ క్రమంలో టిప్పర్ చక్రాల కింద పడి భారతమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, అఖిల్ రెండు కాళ్లు నుజ్జునై తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని నగర ఆసుపత్రికి తరలించగా, సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

