వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలోని కాళహండి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గౌడ కర్లాంకుంట గ్రామంలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ సెంట్రింగ్ తీయడానికి దిగిన మేస్త్రీ ఊపిరాడక ప్రమాదానికి గురయ్యాడు. అతనిని కాపాడేందుకు ట్యాంక్‌లోకి దిగిన మరో ఐదుగురు కూడా శ్వాస ఆడక అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో ముగ్గురు మేస్త్రీలు, ఒక కార్మికుడు, ఇంటి యజమానితో పాటు అతని కుమారుడు ఉన్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

