Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీలోకి టీఎంసీ నేతలు?

Follow Udayam on Google
Sonal Kalra May 27, 2026 3:33 PM జాతీయంGeneral
బీజేపీలోకి టీఎంసీ నేతలు? - Udayam
పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. ఆ పార్టీకి చెందిన సుమారు 20 మంది ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ మారే విషయమై సదరు నేతలు ఇప్పటికే తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీలో అసంతృప్తి పెరిగిందని, దీంతో పెద్ద ఎత్తున నేతలు పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Comments

G
Loading comments...