వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో కుటుంబ కలహాల కారణంగా ఓ గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మృతురాలి భర్త మరియు అత్తను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
Comments
Loading comments...

