వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ వలసల వల్ల దేశ జనాభాలో జరుగుతున్న అసహజ మార్పులపై అధ్యయనానికి కేంద్రం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’ ద్వారా ప్రకటించారు. ఈ సమస్య జాతీయ భద్రత, సామాజిక సమతుల్యతకు సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రకాశ్ ప్రభాకర్ నావోలేకర్ అధ్యక్షత వహించే ఈ కమిటీలో జనాభా లెక్కల కమిషనరుతో పాటు పలువురు మాజీ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఏడాది కాలపరిమితి గల ఈ కమిటీ చొరబాట్ల కట్టడికి అవసరమైన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది.
Comments
Loading comments...

