వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం అడవుల్లో పులి సంచరిస్తుండటంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అటవీ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. పులి కదలికలపై అధునాతన సాంకేతికతతో 24 గంటల నిఘా ఉంచాలని, సరిహద్దు గ్రామాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు.
పశువుల పాకలపై పులి దాడి చేసి 9 దూడలను చంపిన నేపథ్యంలో, బాధిత రైతులకు తక్షణ పరిహారం అందించినట్లు పవన్ తెలిపారు. మనుషులు, పశువుల ప్రాణాలకు హాని కలగకుండా పీసీసీఎఫ్ స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

