Back to feed
గాజులపల్లిలో పడిపోయిన పురాతన వృక్షం
Priya Singh May 30, 2026 9:07 AM కర్నూలు 13 viewsabout 10 hours ago

మహానంది మండలం గాజులపల్లిలో శనివారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి 200 ఏళ్ల నాటి వేపవృక్షం నేలకూలింది. ఈ ఘటనలో దస్తగిరి స్వామి దర్గా సమీపంలోని టీ బంకు, విద్యుత్ స్తంభం ధ్వంసమయ్యాయి.
ఈ ప్రమాదంలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలియగానే విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులు చేపట్టారు.
Comments
Loading comments...


