Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముళ్ల పొదలతో రాయపర్తి రహదారిపై ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 11:56 AM వరంగల్General
ముళ్ల పొదలతో రాయపర్తి రహదారిపై ఇబ్బందులు - Udayam
రాయపర్తి–కొండూరు ప్రధాన రహదారికి ఇరువైపులా ముళ్ల పొదలు విపరీతంగా పెరగడంతో రహదారి సరిగా కనిపించడం లేదు. ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు పక్కకు తప్పుకునే అవకాశం లేక ప్రయాణికులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మలుపుల వద్ద ప్రమాద భయం నెలకొంది. నిత్యం ద్విచక్ర వాహనాలు, ఆటోలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ముళ్ల పొదలను వెంటనే తొలగించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...