వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలిలోని విల్లాలో భారీ చోరీకి పాల్పడిన నేపాలీ దంపతులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులు పారిపోయే క్రమంలో పారేసిన సిమ్‌కార్డు కవర్ల ఆధారంగా ఫోన్ నంబర్లు సేకరించి, సాంకేతిక పరిజ్ఞానంతో వారిని ట్రాక్ చేసి పట్టుకున్నట్లు సైబరాబాద్ సీపీ రమేశ్ వెల్లడించారు.
నిందితుల నుంచి 7.8 కిలోల బంగారం, 1.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. చోరీకి సహకరించిన కరణ్ బిశ్వకర్మను అరెస్టు చేయగా, మరో సూత్రధారి సురేశ్ కోసం గాలింపు కొనసాగుతోంది. దంపతులను యూపీలో పట్టుకుని ప్రత్యేక విమానంలో నగరానికి తరలించారు.
Comments
Loading comments...

