వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆదిలాబాద్‌లోని అశోక్ రోడ్డులో ఉన్న ఓ నగల దుకాణంలో బొల్లు స్వాతి అనే మహిళ హంగామా సృష్టించి ఆభరణాలతో ఉడాయించింది. దుకాణంలో పనిచేసే వ్యక్తితో గొడవకు దిగిన ఆమె, అడ్డుకునేందుకు వచ్చిన యజమానిని గోర్లతో రక్కి తీవ్రంగా గాయపరిచింది.
అనంతరం రూ.2.25 లక్షల విలువైన 15 గ్రాముల బంగారు కమ్మలను ఎత్తుకెళ్లింది. సీసీ ఫుటేజీ ఆధారంగా బాధిత యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

