Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

టెన్త్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్: ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి అవకాశం

Follow Udayam on Google
Akhil Jun 19, 2026 2:54 PM అమరావతిGeneral
టెన్త్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్: ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి అవకాశం - Udayam
టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో మార్పులు కోరుకునే అభ్యర్థుల కోసం ఎస్సెస్సీ బోర్డు కీలక అవకాశం కల్పించింది. రేపటి నుండి ఈ నెల 26వ తేదీ వరకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. రీకౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.1000 ఫీజుగా నిర్ణయించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.gov.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకుని, ఆన్‌లైన్ పద్ధతిలోనే ఫీజు చెల్లించాలని బోర్డు స్పష్టం చేసింది. ఛలాన్లను అనుమతించమని హెచ్చరించింది.

Comments

G
Loading comments...