వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిధిలోని పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న భార్యాభర్తలు ఆరే శంకర్, అనూషలను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక బృందాలు నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించాయి.
విచారణలో ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, మల్లాపూర్, కథలాపూర్ మండలాల్లోని పలు గుళ్లలో వీరు చోరీలకు పాల్పడినట్లు తేలింది. నిందితుల నుంచి 20 గ్రాముల బంగారం, 1.250 కిలోల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

