వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికా స్కైడైవింగ్ ప్రమాదంలో తెలుగు టెకీ మృతి

అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరిగిన స్కైడైవింగ్ ప్రమాదంలో మణిచంద్ర తేజ గడ్డం (28) అనే తెలుగు యువకుడు మరణించాడు. జూలై 12న జంప్‌టౌన్ స్కైడైవింగ్ కేంద్రంలో పారాచూట్ నియంత్రణ కోల్పోయి దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో ఈ దారుణం జరిగింది.
తీవ్ర గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన మణిచంద్ర అక్కడ టెకీగా పనిచేస్తున్నాడు.
Comments
Loading comments...