వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చు. నవంబర్ 8 నుంచి వాతావరణం పొడిగా మారనుంది. రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

