వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం దిగుబడి మరియు కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, తడిసిన గింజలను సైతం కనీస మద్దతు ధరకే (MSP) కొనుగోలు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత యాసంగి సీజన్‌లో కేంద్ర పూల్‌కు అందిన మొత్తం ధాన్యంలో 63 శాతం వాటా తెలంగాణదేనని మంత్రి వెల్లడించారు. రైతులకు నష్టం కలగకుండా, రాష్ట్రంలోని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

