వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీసింది. ఆదివారం రాత్రి ఆటో స్టాండ్‌లో మద్యం సేవించిన అనంతరం, ఖాళీ సీసాలు రోడ్డుపై వేసే విషయమై ఆటో డ్రైవర్ మహ్మద్ ఇమ్రాన్(33), అహ్మద్ హుస్సేన్ మధ్య తీవ్ర వివాదం చెలరేగింది.
ఈ క్రమంలో హుస్సేన్ పిడిగుద్దులతో దాడి చేయడంతో ఇమ్రాన్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు అహ్మద్ హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

