Back to feed
పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Priya Singh Jun 03, 2026 10:09 AM అల్ ఇండియా 9 viewsabout 14 hours ago

రాంచరణ్ నటించిన ‘పెద్ది’ చిత్ర టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జూన్ 3న రాత్రి 8 గంటలకు ప్రదర్శించే ప్రత్యేక ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600 గా నిర్ణయించారు. అలాగే రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వీలు కల్పించింది.
సినిమా విడుదలైన మొదటి పది రోజుల పాటు (జూన్ 4 నుండి 13 వరకు) సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున ధరలను పెంచుకోవచ్చని హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...



