Back to feed
తెలంగాణ కేబినెట్ భారీ నిర్ణయం: 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు గ్రీన్ సిగ్నల్.. పాలమూరు ప్రాజెక్టుకు రూ.587 కోట్లు మంజూరు!
Sonal Mehrotra May 24, 2026 7:31 AM హైదరాబాద్ 32 views4 days ago

రాష్ట్రంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేబినెట్ భారీ నిధులు కేటాయించింది. ఈ ప్రాజెక్టు కింద లక్ష్మీదేవిపల్లి జలాశయం భూసేకరణ, పునరావాస పనుల కోసం రూ.587 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Loading comments...



