వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ 'మహానాడు' అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జెండాను ఆవిష్కరించి, వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.ఈ ఏడాది మహానాడును సరికొత్తగా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు.
Comments
Loading comments...

