Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం తీసుకుంటూ దొరికిన తహసీల్దార్‌

Follow Udayam on Google
Priya Singh May 27, 2026 3:01 PM హైదరాబాద్General
లంచం తీసుకుంటూ దొరికిన తహసీల్దార్‌ - Udayam
శామీర్‌పేట మహిళా తహసీల్దార్‌ టి.సుచరిత రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నాలా కన్వర్షన్‌ దరఖాస్తు ఆమోదానికి ఆమె ఏకంగా రూ.30 లక్షలు డిమాండ్‌ చేయడంతో, బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆమె ప్రైవేట్ డ్రైవర్ నాగేష్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

Comments

G
Loading comments...