వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా నాయకులు ధర్నాకు దిగారు. సోమవారం జరిగిన పురపాలక కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నుంచి భాజపా కౌన్సిలర్లు నిరసనగా వాకౌట్ చేశారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయ ముఖద్వారం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. లేఅవుట్లు లేకుండా ప్రభుత్వ స్థలాలు, రోడ్లను ఆక్రమిస్తున్నా.. ఫిర్యాదులు చేసినా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు.
Comments
Loading comments...

