వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అఘాయిత్యం అత్యంత దారుణమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. బాలిక తీవ్ర భయాందోళనలకు లోనవుతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని ఆమె ఆరోపించారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఎవరూ స్పందించకపోవడం దారుణమని, ముఖ్యంగా మహిళా మంత్రులు కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

