Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడా రంగంలో సంచలన మార్పులకు నాంది

Follow Udayam on Google
రవళి దేవి Jul 09, 2026 3:07 PM జాతీయంGeneral
క్రీడా రంగంలో సంచలన మార్పులకు నాంది - Udayam
క్రీడాకారుల సంక్షేమమే లక్ష్యంగా క్రీడా పాలన సాగాలని, పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన బలమైన వ్యవస్థలు ఉన్నప్పుడే అథ్లెట్లు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటగలరని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు పి.టి.ఉష స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ భవన్‌ను గురువారం ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడా నిర్వాహకులు తీసుకునే ప్రతి నిర్ణయం క్రీడాకారుల శ్రేయస్సును, వారి ఉన్నత శిక్షణను పెంపొందించేలా మాత్రమే ఉండాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...