Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి నుంచి తిరువణ్ణామలైకు ప్రత్యేక రైళ్లు ప్రారంభం

Follow Udayam on Google
Ravi Shukla Jun 07, 2026 11:02 AM హైదరాబాద్General
చర్లపల్లి నుంచి తిరువణ్ణామలైకు ప్రత్యేక రైళ్లు ప్రారంభం - Udayam
ప్రముఖ శైవక్షేత్రమైన అరుణాచలం (తిరువణ్ణామలై) వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. శ్రీ అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి తిరువణ్ణామలైకి ప్రత్యేక, రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. పాత కనెక్టింగ్ మార్గాలతో పోలిస్తే ఇప్పుడు ప్రయాణ సమయం భారీగా తగ్గింది. చర్లపల్లి నుంచి బయలుదేరే ఈ రైళ్లు కేవలం 15 గంటల్లోనే భక్తులను గమ్యస్థానానికి చేరవేస్తున్నాయి.

Comments

G
Loading comments...