వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లా అక్కరాజుపల్లిలో నాటు కోడి కూర వండాలనే వివాదం ఒకరి ప్రాణం తీసింది. రాత్రి వేళ కోడి కూర వండమని రమేష్ (42) తన భార్యతో గొడవకు దిగగా, అడ్డువచ్చిన కొడుకు గణేష్‌పై చేయి చేసుకున్నాడు.
దీంతో క్షణికావేశానికి లోనైన కొడుకు రోకలిబండతో తండ్రి తలపై బలంగా బాదాడు. తీవ్ర గాయాలైన రమేష్‌ను హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన కొడుకును అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

