Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమశిలకు పెరిగిన వరద ప్రవాహం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 10:51 AM నెల్లూరుGeneral
సోమశిలకు పెరిగిన వరద ప్రవాహం - Udayam
సోమశిల జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెన్నా క్యాచ్‌మెంట్‌ ఏరియా నుంచి బుధవారం 4,307 క్యూసెక్కుల వరద వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు రోజు ఈ ప్రవాహం 1,700 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం జలాశయంలో 15.950 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న వరదతో సోమశిల నీటిమట్టం స్వల్పంగా పెరిగింది.

Comments

G
Loading comments...