Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

Follow Udayam on Google
Anjali Puri May 31, 2026 9:39 PM హైదరాబాద్General
శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత - Udayam
హాంకాంగ్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయిని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన దీపక్ జోస్‌కుట్టి అనే వ్యక్తి హాంకాంగ్ వెళ్లి వస్తూ క్యాథే పసిఫిక్‌ విమానంలో తన లగేజీలో 7 కిలోల హైడ్రోఫోనిక్‌ గంజాయిని దాచి తీసుకొచ్చాడు. తనిఖీల్లో పట్టుబడిన ఈ గంజాయి విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని అంచనా. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...