వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్‌నినోతో తీవ్ర ఉష్ణోగ్రతలు

దేశంలో వర్షాలు కురవాల్సిన జులైలో ఏప్రిల్, మే నెలల తరహాలో ఎండలు ముదురుతున్నాయి. ఎల్ నినో వేగంగా బలపడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈ వాతావరణ మార్పులతో వర్షాలు పడక రైతులు ఆందోళన చెందుతున్నారు. రాబోయే నెలల్లో దేశం తీవ్ర వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...